GDWL: అలంపూర్ పురపాలక సంఘం పరిధిలో వర్షాకాలం కారణంగా రోగుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ గురువారం ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బండి వచ్చినప్పుడు మాత్రమే అందులో వేయాలని కోరారు. తద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని, ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.