SRD: ట్రాఫిక్ నియమ నిబంధనలు చట్టం కోసమే కాదని, ఇంట్లో ఎదురుచూస్తున్న మీ కుటుంబం కోసమని గుర్తించాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఆదివారం తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు ఫోన్ వాడరాదని చెప్పారు.