BDK: పాల్వంచ జయమ్మ కాలనీలో కొలువుతీరిన అమ్మవారి నవరాత్రులలో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. అమ్మవారి దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని, అందరి కుటుంబంలో సుఖసంతోషాలు నిండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎడవల్లిని కమిటీ సభ్యులు సన్మానించారు.