PDPL: పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో సాంప్రదాయ బద్దంగా జరిగిన కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండపాక లక్ష్మీ నరసింహచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఘనంగా కళ్యాణ వేడుకలు నిర్వహించారు.