నవోదయ విద్యాలయంలో 9వ, 11వ తరగతులలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. మంగళవారంతో గడువు ముగియగా మరోసారి గడువును పొడిగించారు. ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.