MBNR: గత నాలుగు రోజుల నుంచి తమకు తీవ్ర నీటి కొరత ఏర్పడిందని షాద్నగర్ నియోజకవర్గం వెలిజర్ల గ్రామస్తులు రోడ్డెక్కారు. రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని మొదటి వార్డుకు నిత్యం నీటి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి నీటి కొరత నుంచి విముక్తి కల్పించాలని కోరారు.