RR: శంకర్పల్లి మండలం ఎల్వర్తి సర్పంచ్‌గా గెలిచిన మారేపల్లి భాగ్యలక్ష్మి పాపారావు, వార్డు సభ్యులు నిన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె గెలుపొందిన అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు BRS బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వార్డు సభ్యులు యాదయ్య, తదితరులు ఉన్నారు.