GDWL: జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నది జలాలతో అమ్మవారికి హోమం మరియు ఆకుపూజ వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.