MDK: రెండు లక్షలు దాటిన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తీగుల్ శాఖ కార్యదర్శి యాదవరెడ్డి, రామ్ రెడ్డి పాల్గొన్నారు.