NGKL: జిల్లాలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. మంగళవారం రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సమగ్ర వివరాలను సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు.