JN: బచ్చన్నపేట లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిసెంబర్ 4న నిర్వహించబడే నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024-25 పరీక్షకు విద్యార్థులు సంసిద్ధం కావాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో హాజరై వారు మాట్లాడారు. ఇది సమగ్ర విద్యా అంచనా సర్వే అని అన్నారు.