WGL: రైతులు దళారులను అమ్మి మోసపోకూడదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రం, ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం అమ్మిన రైతులకు రెండు, మూడు రోజులలో డబ్బులు జమ చేసేలా చూడాలని కోరారు.