గత కొన్ని రోజులుగా దూసుకెళ్లిన బంగారం ధరలు.. ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1300 మేర తగ్గి రూ.81,100కు చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇటీవల కాలంలో లక్ష రూపాయల మార్కు దాటిన కిలో వెండి ధర సైతం దిగొచ్చింది. రూ.4600 తగ్గి.. రూ.94,900కు చేరింది. కాగా, అమెరికా ఎన్నికలు, చైనాలో పరిణామాల దృష్ట్యా ఈ నెలలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.