ADB: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కొత్తగా 4 లేబర్ చట్టాలను తీసుకురావడం సరైనది కాదని INTUC అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ.. దేశవ్యాప్తంగా సోమవారం బ్లాక్ డే పాటించడం జరిగిందని తెలిపారు. కొత్త లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు ప్రస్తుతం ఉన్న రక్షణ కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.