NLG: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్రకన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ కోరారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన సంఘం సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోఆశ పెట్టుకున్నారని వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.