NZB: బోధన్ సబ్ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ వికాస్ మహాతోను బుధవారం బోధన్ ప్రెస్‌క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు సత్కరించారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బలరామరాజు, గడ్డం గంగులు, అధ్యక్షుడు రవి, కార్యదర్శి శ్రీనివాస్, రాజేశ్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.