MNCL: బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న కనుకుంట్ల వెంకట్రాజ్ను సోమవారం అరెస్టు చేసినట్లు చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ సోమవారం తెలిపారు. నిందితుడు విలేఖరి ముసుగులో అమాయక ప్రజలను బెదిరింపులు గురి చేసి డబ్బులు వసూలు చేశాడని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు వెల్లడించారు.