KNR: ప్రవాసి ప్రజావాణి (గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం) ప్రత్యేక కౌంటర్ శుక్రవారం ప్రారంభమైంది. రిబ్బన్ కట్ చేసి ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారు.