తాండూరు పట్టణ బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో బీజేపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ కుమార్, శాంత్ కుమార్, కృష్ణ ముదిరాజ్, భద్రేశ్వర్ పాల్గొన్నారు.