WGL: గోదావరి నది వరదముంపు నుంచి భద్రాచలంను రక్షించాలని కోరుతూ అఖిలభారత హనుమాన్ ప్రచారకులు నర్సంపేట నియోజకవర్గం ముద్దునూరు శివరామాలయంలో ఆదివారం 48గం.ల దీక్ష చేపట్టారు.పేద రామ భక్తులను ముంపు నుంచి కాపాడేందుకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరకట్టను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి భక్తులు పడుతున్న కష్టాలపై లేదన్నారు.