మంచిర్యాల: జిల్లాలో ఇంటింటా ఓటరు జాబితా సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఇంటింటా ఓటరు జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు సర్వేను 100 శాతం పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, చిరునామా ప్రదేశాల మార్పుపై చర్యలు తీసుకోవాలన్నారు.