యువ క్రికెటర్ పృథ్వీ షాకు షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ జట్టులో అతడు స్థానం కోల్పోయాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ రంజీ టీమ్‌లోకి ఎంపిక చేయలేదు. ఇందుకు గల స్పష్టమైన కారణాలను మాత్రం అసోసియేషన్ వెల్లడించలేదు. కానీ ఫిట్నెస్, క్రమశిక్షణారాహిత్యం వల్లే పృథ్వీ షాపై వేటు పడినట్లు సమాచారం. కాగా, టీమిండియా తరఫున అతడు చివరగా 2021 జులైలో శ్రీలంకతో టీ20 మ్యాచ్ ఆడాడు.