స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేయగా పాక్ 344 పరుగులు చేసి 77 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 112 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 36 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని పాక్ 3.1 ఓవర్లలో ఛేదించింది. కాగా మూడేళ్ల తర్వాత పాకిస్థాన్ తొలి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.