టీమిండియాతో జరుగుతున్న ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (82), విల్ యంగ్ (71) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టారు. ఆకాష్ దీప్‌కు ఒక వికెట్ దక్కింది. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన సిరాజ్ మాత్రం వికెట్లేమీ తీయలేకపోయాడు.