పాకిస్థాన్ జట్టు సారధిగా బాబర్ అజామ్ స్థానంలో సీనియర్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేశారు. ఇక నుంచి వన్డే, టీ20 కెప్టెన్‌గా రిజ్వాన్ కొనసాగనున్నారు. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అలాగే వైస్ కెప్టెన్‌గా ఆల్ రౌండర్ సల్మాన్ ఆఘాను నియమించింది. అయితే నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌తో కెప్టెన్‌గా రిజ్వాన్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు.