బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీలో ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటానని ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో టెస్ట్ క్రికెట్కు వార్నర్ వీడ్కోలు పలికాడు. తాజాగా వార్నర్ ప్రకటన నేపథ్యంలో ఆసీస్ సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.