సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ తబ్రేజ్ షంసీ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ క్రికెట్లో భాగమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. అయితే, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమైతే తప్పకుండా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది.