ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించిన డేట్స్ ను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 4 నుండి 26వ తేదీవరకు ముంబైలో జరుగుతుంది. బ్రబ్నోర్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం ఈ లీగ్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 13న ముంబైలో పాకిస్థాన్‌తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత ఒక రోజు వేలం నిర్వహిస్తామని ఛైర్మైన్ తెలిపారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ లీగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్ గుడ్ న్యూస్ చెప్పారు