ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారింది..
ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆస్ట్రేలియా కొత్త బౌలర్ కుహనేమన్ వేసిన బంతిని కొట్టే క్రమములో విరాట్ ను ఎల్బీగా ప్రకటించారు ఫీల్డ్ ఎంపైర్. అయితే కోహ్లీ డీ అర్ ఎస్ తీసుకున్నారు. బంతి ఒకేసారి బ్యాట్, ప్యాడ్ కు తాకినట్లు కనిపించినప్పటికీ ఎంపైర్ ఔట్ ఇచ్చాడు.
ఇది వివాదాస్పదం అయ్యింది. ఈ అంశం పైన కామెంటరీ బాక్స్ లో ఉన్న గవాస్కర్, మార్క్ వా స్పందించారు. సాప్ట్ సిగ్నల్ ఔట్ ఇచ్చారు కాబట్టి ఎంపైర్ కచ్చితంగా చెక్ చేసుకోవాలని అన్నారు. స్టంప్స్ ను బాల్ తాకుతుందా లేదా అన్నది ఇక్కడ సమస్య కాదు.. కోహ్లి బ్యాట్ కు తాకిందా లేదా అన్నది ముఖ్యం అని గవాస్కర్ అన్నారు. అది అస్పష్టంగా ఉందని, ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఔట్ ఇచ్చాడని, దీనిని మనం గుర్తుంచుకోవాలన్నారు. అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కోహ్లి బ్యాట్ కు అది మొదట తాకిందని థర్డ్ ఎంపైర్ నిర్ధారించుకోవాలని అన్నారు. మార్క్ వా మాత్రం భిన్నంగా స్పందించారు. ఎంపైర్ నిర్ణయంతో ఏకీభవించారు.