టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) జిమ్లో వర్కౌట్లు చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి ఇన్స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేశాడు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటలో ఎన్నో రికార్డులను అతడు బద్దలు కొట్టాడు. ఆటతోనే కాకుండా తన ఫిట్నెస్ తో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. విరాట్ ఫిట్నెస్(Fitness)పై పెట్టే శ్రద్ద మామూలిది కాదు. ప్రతి రోజులు కొన్ని గంటల పాటు జిమ్(Gym)లో గడుపుతుంటాడు. చాలా మంది ఆటగాళ్లు మ్యాచ్ సమయాల్లోనే ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తుంటారు.
సెలవుల్లో పెద్దగా పట్టించుకోరు. సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా?’’ అన్న అర్థంలో క్యాప్షన్ జత చేసి మరోసారి ఫిట్నెస్ గోల్స్ సెట్ చేశాడు. కోహ్లి షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది.కానీ విరాట్ అలా కాదు. ఐపీఎల్(IPL), డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ల కారణంగా గత మూడు నెలలుగా టీమ్ఇండియా ఆటగాళ్లు బిజీగా గడిపారు. విండీస్ (Windies) పర్యటనకు నెల రోజుల విరామం దొరికింది. దీంతో టీమ్ఇండియా (Team India) ఆటగాళ్లు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచంలోని అథ్లెట్లందరిలో కూడా ఫిట్నెస్ విషయంలో కోహ్లి ముందుంటానడం అతిశయోక్తి కాదు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ రన్ మెషీన్ ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు అరుదు.