SRH సీఈవో కావ్య మారన్ తొలి రోజు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. షమీ, హర్షల్ పటేల్‌లను తక్కువ ధరకే తీసుకుని బౌలింగ్ లైనప్‌ను పటిష్టంగా మార్చుకున్నారు. రూ.45 కోట్లతో వేలంలోకి వచ్చిన SRH.. రూ.5.15 కోట్లు మిగుల్చుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ వద్ద 13 మంది ప్లేయర్లు ఉన్నారు. మరో 12 మంది అవసరం. చాహర్, జంపా ఇద్దరూ లెగ్ స్పిన్నర్లే. దీంతో SRHకు ఆఫ్స్పిన్నర్తో పాటు ఓ విదేశీ ఫినిషర్ కావాలి.