ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ మార్కెట్లో 200 గ్రాములు రూ.100కు విక్రయిస్తున్నారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఎనిమిదేళ్లుగా గిరిజన కౌలురైతులు స్ట్రాబెర్రీ సాగు చేపడుతున్నారు. కేవలం పర్యాటక సీజన్లో విక్రయాలు నిర్వహించేందుకు అనువుగా పంటను పండిస్తున్నారు.