పుణె వేదికగా IND VS NZ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా మరోసారి నిరాశపరిచింది. 16/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్ల దాటికి తేలిపోయారు. నిన్నటి స్కోరుకు 140 పరుగులు జోడించి 45.3 ఓవర్లలో మొత్తం 156 పరుగులకు ఆలౌట్ అయ్యారు. జైస్వాల్, గిల్, జడేజా తప్ప ఎవరూ రాణించలేదు. దీంతో న్యూజిలాండ్ 103 పరుగుల ఆధిక్యంలో ఉంది.