»West Bengal Congress Lone Mla Bayron Biswas From Sagardighi Joins Trinamool Congress
Congress Partyకి భారీ షాక్.. ఉన్న ఏకైక ఎమ్మెల్యే జంప్
రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే టీఎంసీతోనే సాధ్యమని ఎమ్మెల్యే బేరాన్ అర్థం చేసుకుని మా పార్టీలో చేరాడు. బీజేపీపై చేసే పోరాటంలో భాగంగా మంచి నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం.. ఆ రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీ మారాడు. ఉప ఎన్నికల్లో (By Elections) గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరాడు. ఆయనే పశ్చిమ బెంగాల్ (West Bengal) లో ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ (Bayron Biswas). దీంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఒక్క ఎమ్మెల్యే కూడా లేనట్టయ్యింది. బీజేపీపై పోరాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress)లో చేరినట్లు అతడు తెలిపాడు.
ముర్షిదాబాద్ జిల్లాలోని (Murshidabad District) సగర్ దిఘి ( Sagardighi) నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్. మార్చి 2వ తేదీన ఉప ఎన్నికల్లో బేరాన్ 22,986 ఓట్ల మెజార్టీతో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందాడు. దీంతో 294 స్థానాల్లో కాంగ్రెస్ తరఫున ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేగా బేరాన్ గుర్తింపు సాధించాడు. అయితే మూడు నెలలు కాకముందే అతడు పార్టీ ఫిరాయించాడు. అధికారంలో ఉన్న టీఎంసీలో చేరాడు. ఎమ్మెల్యేను టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) సాదరంగా ఆహ్వానించాడు. ‘జన సంజోగ్ యాత్ర’లో బేరాన్ పార్టీ కండువా వేసుకున్నాడు. ‘రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే టీఎంసీతోనే సాధ్యమని ఎమ్మెల్యే బేరాన్ అర్థం చేసుకుని మా పార్టీలో చేరాడు. బీజేపీపై చేసే పోరాటంలో భాగంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. కలిసి పోరాడి గెలుద్దాం’ అని అభిషేక్ బెనర్జీ తెలిపాడు.