CM Revanth Reddy: కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడటం వల్ల తుంటి ఎముక విరగడంతో.. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనను పరామర్శించనున్నారు.
CM Revanth Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించనున్నారు. జారిపడిపోవడం వల్ల కేసీఆర్‌కు హిప్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత పలువురు నాయకులు ఆసుపత్రిలో ఆయనను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్నారని వైద్యులు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
రెండు రోజుల కిందట అర్ధరాత్రి సమయంలో కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారిపడ్డారు. దీంతో ఆయన తుంటికి గాయమైంది. వెంటనే యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వివరాలు వివరాలు ఆరా తీసి.. కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శించనున్నారు. సీఎంతో పాటుగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యే కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించనున్నారని సమాచారం.