TG: ఈనెల 5న హైదరాబాద్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రానున్నారని టీపీపీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. రాహుల్ చేతుల మీదుగా కులగణన కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది కాంగ్రెస్ నిర్ణయమని పేర్కొన్నారు. దామాషా ప్రకారం ప్రజలకు న్యాయం జరగాలన్నది రాహుల్ విధానమన్నారు. అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కులగణనలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలని సూచించారు.