TG: హైడ్రాపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. పేదలపై ప్రభుత్వ దమనకాండను అడ్డుకుంటామని.. ప్రభుత్వ దుర్మార్గాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు శిక్ష వేస్తారా అని ప్రశ్నించారు. హామీలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అణచివేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా అధికారులు వెంటనే కూల్చివేతలను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇంటిని కూల్చివేసిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు.