తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితికైనా ఎదురెళ్తుంది తల్లి. అది తల్లి ప్రేమ. మానవుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లి ప్రేమ ఒకేలా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. తన బిడ్డను రక్షించుకోవడానికి ఓ ఎలుగుబంటి పులికి ఎదురెళ్లింది. తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసింది. దీంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని తాడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో జరిగింది.