గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నాలుగేళ్లపాటు సరిహద్దులో కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే ముగింపు పడింది. బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా LAC వెంబడి ఉన్న డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలలో బలగాల ఉపసంహరణ పూర్తయింది. దీంతో ఇవాళ భారత్-చైనా సరిహద్దులోని 5 ప్రాంతాల ఇరు దేశాల సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. లడఖ్‌లోని రెండు ప్రాంతాలలో కూడా స్వీట్లు పరస్పరం మార్చుకున్నారు.