AP: పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం, ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇసుక దందా చేసే వారిపై ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. మద్యం, ఇసుక విషయంలో రాజీపడేది లేదని చెప్పారు. మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే పెంచి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.