TG: రాష్ట్ర అధికార బృందం మూడో రోజు సియోల్‌లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ ఏఐ సిటీని సందర్శించనుంది. ఫ్యూచర్ సిటీలో నిర్మించే ఏఐ సిటీపై సెమినార్లో పాల్గొననుంది. స్మార్ట్ సిటీపై కాన్ఫరెన్స్‌కు ప్రతినిధుల బృందం హాజరుకానుంది. సాయంత్రం భారత్ రాయబారితో సమావేశం కానుంది.