TG: సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని, రాబోయే నాలుగేళ్లు రేవంతే సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. త్వరలోనే పలువురు ప్రముఖ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని వెల్లడించారు.