TG: కులాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిర్వహించనున్న సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సర్వేలో 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సమాధానమివ్వాల్సి ఉంది. కుటుంబ వివరాలు, విద్యా, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం తెలుసుకుంటారు. ఆధార్ కార్డు, రైతులైతే ధరణి పాస్ పుస్తకం అందుబాటులో ఉంచుకోవాలి. సర్వే సమయంలో ఇంటి యజమాని ఉంటే చాలు. ఎటువంటి పత్రాలు తీసుకోరు.