వడోదరలో సి-295 విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ పాల్గొన్నారు. భారత్‌కు 56 సి-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. ఇందులో స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ సంస్థ కర్మాగారం నుంచి 16 విమానాలు అందనున్నాయి. మిగతావి వడోదర యూనిట్లోనే ఉత్పత్తి అవనున్నాయి. 2031 నాటికి 40 విమానాలు తయారు కానున్నాయి.