TG: హైదరాబాద్లోని బౌరంపేటలో లైంగిక దాడికి గురైన నాలుగేళ్ల చిన్నారిని మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రస్తుతం హైదర్ నగర్లోని రెయిన్ బో ఆస్పత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై, అందుతున్న వైద్యంపై డాక్టర్ల వద్ద మంత్రి ఆరా తీశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. తక్షణ అవసరాల నిమిత్తం బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.