TG: సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయం వద్ద లాఠీ ఛార్జ్కు గురైన బాధితులు.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. అకారణంగా తమపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిందని తెలుసుకొని, అక్కడి వెళ్లినట్లు బాధితులు తెలిపారు. అయితే శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు కుట్ర పూర్వకంగానే తమపై లాఠీ చార్జ్ చేశారని ఆరోపించారు.