AP: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉండటంతో రేపటికి వాయిదా వేసింది. దర్యాప్తుపై అభిప్రాయం తెలిపేందుకు.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది.