ఈ నెల 5-7 వరకు లండన్లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో భారతదేశం పాల్గొంటుంది. దేశాన్ని ప్రధాన ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ఉంచడం లక్ష్యంగా, ఇన్ బౌండ్ టూరిజంను మెరుగు పరచడం కోసం ఇందులో పాల్గొంటుంది. దాదాపు 50 మంది వాటాదారుల ప్రతినిధి బృందంతో వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో పాల్గొంటున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది.