AP: రుషికొండలోని భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సీఎం వెంట మంత్రి కందుల దుర్గేశ్, గంటా శ్రీనివాసరావు ఉన్నారు. గత ప్రభుత్వానికి రోడ్లపై గుంతలు పూడ్చేందుకు డబ్బులు లేవని ధ్వజమెత్తారు. కానీ రూ.450 కోట్లతో రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకోవడానికి మాత్రం డబ్బులు వచ్చాయని మండిపడ్డారు. వారికి ఎలాంటి శిక్ష వేయాలో కూడా తెలియడం లేదని విమర్శించారు.