సుగంధద్రవ్యాల్లో ఒకటైన యాలకులు ఎన్నో అనారోగ్య సమస్యలను చెక్ పెడతాయి. అయితే ఇవి ముఖాన్ని మెరిపించేందుకు కూడా ఉపయోగపడతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. యాలకుల పొడి, పంచదార, తేనె కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. లేదా.. యాలకుల పొడికి పసుపు, కాస్త నిమ్మరసం కలిపి ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. ఇలాచేస్తే వృద్ధాప్యఛాయలు దరిచేరవు. చర్మం యవ్వనంగా మారుతుంది. దద్దుర్లు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి.